వాషింగ్టన్, సెప్టెంబర్ 26: ఇరాన్ చేసిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్టు సమాచారం. నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత టెహ్రాన్‌పై యూఎస్ బాంబు దాడులను ప్రారంభించే అవకాశం ఉంది. తమ డిమాండ్లను అమెరికా నెరవేరిస్తే ఏడు రోజుల్లో వ్యూహాత్మక జలసంధిని తెరిచేందుకు, యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు ఇరాన్ ప్రతిపాదించింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ ఏడు రోజుల ప్రణాళికను కనుక ఆమోదిస్తే హొర్ముజ్‌లో వారం రోజుల్లోనే నౌకల రాకపోకలు యథావిధిగా కొనసాగేందుకు సహకరిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ శుక్రవారం ఐరాసలో మీడియాకు తెలిపారు. ఒత్తిడిని, బెదిరింపులను ఇరాన్ ఎంతమాత్రం అంగీకరించదన్నారు.