ముగ్గురు అగ్ర తారలు..మూడు భిన్న ప్రపంచాల నేపథ్యంలో ప్రేమ, యుద్ధం, భావోద్వేగాల సమహారంగా అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ రూపొందిస్తున్న ‘లవ్ అండ్ వార్’ దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. రణ్‌బీర్‌సింగ్, విక్కీకౌశల్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 21న విడుదలకానుంది.
ఇప్పటికే విడుదల చేసిన రణ్‌బీర్, అలియా ఫస్ట్‌లుక్స్ ఆసక్తిని పెంచగా.. తాజాగా విక్కీకౌశల్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో చేతిలో సిగరెట్, లైటర్ పట్టుకొని గంభీరంగా కనిపిస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.