మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 19 : ప్యారడైజ్ జంక్షన్ నుండి శామీర్ పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం భూసేకరణ కొరకు పునరావాస, ఉపాధి కల్పన కొరకు గ్రామసభలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అల్వాల్ మండలంలోని అల్వాల్, లోతుకుంట గ్రామాలకు సంబంధించి ఈ నెల 20న ఉదయం 10:30 గంటలకు సిద్ధార్థ వినాయక విద్యానికేతన్, ఐటిఐ కళాశాల అల్వాల్లో గ్రామసభ ఉంటుందని అన్నారు. శామీర్పేట్ మండలంలోని హకీంపేట్, దేవరయంజాల్, తూముకుంట గ్రామాలకు ఈ నెల 20న ఉదయం 11:30 గంటలకు తూముకుంట మున్సిపల్ కార్యలయం వద్ద గ్రామసభ నిర్వహిస్తామని, ఎలాంటి అభ్యంతరములు ఉన్నచో గ్రామసభ తెలియజేయాలని సూచించారు.