చర్లపల్లి, ఫిబ్రవరి 9 : కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. కుషాయిగూడ ఇన్స్పెక్టర్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన భాస్కర్ రెడ్డిని సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నాగిళ్ల బాల్‌రెడ్డి, మొగిలి రాఘవరెడ్డి కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. కాలనీ సంఘాలు, సంక్షేమ సంఘాలతో సమావేశం నిర్వహించి నేరాల అదుపునకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ముమ్మరం చేయడంతో పాటు బందోబస్తును పెంచామని చెప్పారు. కాలనీల్లో అనుమానితులు, అనుమాన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు బీవీ.నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, సామ వెంకట్‌రెడ్డి, తోటకూర సురేశ్‌రెడ్డి, రావిపల్లి రవీందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, బొల్లంపల్లి రామచంద్రారెడ్డి, సెంచురెడ్డి, జగన్మోహన్రెడ్డి, హనుమంత్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.