రామంతాపూర్, జూన్ 29 : ఆషాఢ మాసం కావడంతో హైదరాబాద్ నగరంలో బోనాల సందడి మొదలైంది. ఉప్పల్ పోచమ్మ (Uppal Pochamma) అమ్మవారికి ఆదివారం కుమ్మరులు తొలి బోనం సమర్పించారు. ఉప్పల్ మాజీ చైర్మన్ మేకల శివారెడ్డి, చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ (Bannala Geetha Praveen)ఉప్పల్ కుమ్మరి సంఘం పెద్దలతో కలిసి పోచమ్మ తల్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం కార్పోరేటర్ గీత ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఉప్పల్ కుమ్మర్లు పోచమ్మ అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తున్నదని అన్నారు. అయితే.. ప్రతి సంవత్సరం వీళ్లు మొదటి బోనాన్ని గోల్కొండలోని జగదాంబికకు సమర్పించే వారిని, కానీ ఈ సంవత్సరం నుండి ఉప్పల్లోని పోచమ్మ అమ్మవారికి తొలి బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు కార్పొరేటర్ తెలిపారు.
పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావడంతో పోచమ్మ తల్లి బోనం వేడుక ఆద్యంత సందడిగా, సంబురంగా సాగింది. ఈ కార్యక్రమంలో గుమిడెల్లి నారాయణ, గుమిడెల్లి మల్లేష్, గుమిడెల్లి యాదయ్య భాస్కర్, బుల్లెట్ కృష్ణ, గుమిడెల్లి రాజు, గుమిడేలి మహేష్, పొట్లూరి కృష్ణ, పొట్లూరి వెంకటేష్, పొట్లూరి శ్రీనివాస్, మహేష్, సదాసాయి భిక్షపతి, గుమిడేలి శ్రీనివాస్, గుమిడెల్లి అశోక్, నర్సింహ, మశెట్టి రాఘవేంద్ర, సాయి, రవి, ఉపేందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోకొండ జగన్, ముద్దం శ్రీనివాస్ యాదవ్, బింగి శ్రీనివాస్, మార్క శ్రీనివాస్, బాలకృష్ణ గౌడ్, గణేష్, శ్యామ్, నర్సింగ్ నేత కుమార్, బాలు తదితరులు పాల్గొన్నారు.