కాచిగూడ – మైసూర్, కాచిగూడ-చిత్తూరు రైళ్ల గోల్డెన్ జూబ్లీ వేడుకలు
కాచిగూడ - మైసూర్, కాచిగూడ - చిత్తూరు(వెంకటాద్రి) రైళ్లు ప్రారంభించి నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం కాచిగూడ రైల్వేస్టేషన్లో రైల్వే డిఆర్ఎం కేక్ కట్ చేసి, గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు.
కాచిగూడ, జూన్ 29 : రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించడమే ధ్యేయమని రైల్వే డిఆర్ఎం లోకేష్ విష్ణోయ్ అన్నారు. కాచిగూడ – మైసూర్, కాచిగూడ – చిత్తూరు(వెంకటాద్రి) రైళ్లు ప్రారంభించి నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం కాచిగూడ రైల్వేస్టేషన్లో రైల్వే డిఆర్ఎం కేక్ కట్ చేసి, గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. అనంతరం డిఆర్ఎం రైల్వే ప్రయాణికులతో కలిసి సంబరాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఆర్ఎం మాట్లాడుతూ రైల్వే ప్రయాణికులకు ఉపయోగపడే మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ రైల్వేస్టేషన్ డైరెక్టర్ పికె బాలాజీ, సీనియర్ డివోఎం విద్యాధర్, స్టేషన్ మేనేజర్ మీనా, హైదరాబాద్ పిఆర్ఐ శైలేందర్ కుమార్‌తో పాటు వివిధ శాఖ సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

