People demand | కథలాపూర్, జూన్ 29 : కథలాపూర్ మండలం బొమ్మేన- తక్కలపల్లి గ్రామాల మధ్య నెల రోజుల క్రితం తారు రోడ్డు నిర్మించారు. తారు రోడ్డు పగుళ్లు చూపి గొయ్యిలా మారింది. నాణ్యత స్థానికులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి ఉండాల్సిన రోడ్డు రోజుల వ్యవధిలోనే పగుళ్లబారడం దారుణమని ప్రజలు మండిపడుతున్నారు.
రోడ్డుకు ఇరువైపులా కల్వర్టురు లేకపోవడంతో రాత్రివేళ ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.