Fisherman missing | గన్నేరువరం, జూన్29 : మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గువ్వ రవి(43) ఆదివారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి లోయర్ మానేరు డ్యామ్ లో గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు చేపల వేటకు రవి తెప్పపై వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా వచ్చిన గాలులు బలంగా అతడిని బలంగా తాకడంతో అదుపుతప్పి తెప్పపై నుండి రవి నీళ్లలో పడి మునిగిపోయాడు.
గమనించిన తోటిమత్స్యకారులు రవి పడిన ప్రదేశానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు.
అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.