kompally roads | కుత్బుల్లాపూర్, జూలై 13 : కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జయభేరిలో అంతర్గత రోడ్లు అద్వానంగా మారాయి. ఇటీవల వర్షాలు పడుతున్న క్రమంలో గుంతల మయంగా మారిన రోడ్లపై గుంతల్లో వర్షపు నీరు నిండిపోయి బురదమయంగా దర్శనమిస్తుంది. వాహనదారులు, పాదాచారులు కాలనీలో రోడ్లపై రాకపోకలు సాగించాలంటే ఇబ్బందులు పడుతున్నారు.
పలుమార్లు అధికారులకు కాలనీవాసులు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పరిస్థితి లేదని వాపోతున్నారు. ఎటు చూసినా బహుళ అంతస్థుల నిర్మాణాలు, 60 ఫీట్ల రోడ్లు ఈ కాలనీలో ఉంటాయి. కానీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుంతలమయంగా మారిన రోడ్లతోపాటు డ్రైనేజీ, వీధిలైట్ల సమస్యతో సతమతమవుతున్నమని.. దీనికితోడు వర్షాకాలంలో దోమల బెడద అధికంగా ఉంటుందని నివారణచర్యలకు కొంపల్లి మున్సిపాలిటీ అధికారులు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.
Protest | కస్టోడియల్ డెత్‌పై నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే భారీ నిరసన.. Video
Sircilla | సిరిసిల్లలో ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు 6 వేలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన
Nagarkurnool | తిమ్మినోనిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం