చర్లపల్లి, ఏప్రిల్ 30 : మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు నుంచి బదీలిపై వెళ్తున్న న్యాయమూర్తులను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గత కొంత కాలంగా జిల్లా కోర్టులో న్యాయమూర్తులుగా పనిచేసిన కే.పూజ వరంగల్ కోర్టుకు బదిలీ కాగా మరో న్యాయమూర్తి చిరాగ్ మెహతా కరీంనగర్‌కు బదిలీ అయ్యారు. దీంతో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ కోర్టు అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేసి ర్టుకు పేరు తీసుకురావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియెషన్ ప్రధాన కార్యదర్శి బాపిరెడ్డి, ఉపాధ్యాక్షురాలు మాధవి, కోశాధికారి మురళి, కమిటీ సభ్యులు, న్యాయవాదులు రాధప్రసన్న, ప్రశాంత్, చౌరీష్ కుమార్, దినేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.