Corporator Bonthu Sridevi | చర్లపల్లి, మార్చి 17 : చర్లపల్లి డివిజన్లో చేపట్టిన పనులను త్వరతగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని వీఎన్‌రెడ్డి నగర్లో చేపట్టిన కాలనీ సంక్షేమ సంఘం భవన నిర్మాణ పనులను ఆమె సర్కిల్ డీఈ బాలకృష్ణ, ఏఈ స్వరూప, కాలనీవాసులతో కలిసి పరిశీలించిన అనంతరం కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా పనులను పరిశీలిస్తున్నామని, డివిజన్లో నెలకొన్న సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. డివిజన్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరామిరెడ్డి, కనకరాజుగౌడ్, రామచంద్రయ్య, వాసుదేవారెడ్డి, వీరన్న, రంగారెడ్డి, బాల్‌రాజు, నగేశ్, రాజశేఖర్‌రెడ్డి, శ్యామ్‌రావు, అంజిరెడ్డి, లక్ష్మణ్‌సింగ్, లక్ష్మణ్‌చారి, వరప్రసాద్, ప్రకాశ్, నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, గోపాల్‌యాదవ్, క్రాంతి, ఉదయ్‌చారి, అరుణ, గిరిజ, శిరీషా తదితరులు పాల్గొన్నారు.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు