కేపీహెచ్బీ కాలనీ, మే 13 : కూకట్పల్లి వసంతనగర్ కాలనీలో సోసైటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాల కోసం షెటర్లు, షెడ్డులు ఏర్పాటు చేశారని, వీటిపై చర్యలు తీసుకోవాలని సీఎంసీ, కూకట్పల్లి సర్కిల్ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని కాలనీకి చెందిన సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సోసైటీ అధ్యక్షుడు యేర్రా నాగేశ్వర్రావు, సభ్యులను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వసంతనగర్ సోసైటీ నిబంధనల ప్రకారం కాలనీలో ఎవరు వాణిజ్య అవసరాల కోసం నిర్మాణాలు చేపట్టోద్దని, వ్యాపారాల కోసం నిర్మాణాలు చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయన్నారు.
కాలనీలోని ప్లాట్ నెంబర్ 866, 666,667 లో సోసైటీ నిబంధనలను అతిక్రమిస్తూ నిర్మాణాలు చేస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎంసీ, సర్కిల్ అధికారులు, సోసైటీ సభ్యులను ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని, సోసైటీ ఆధ్వర్యంలో అక్రమంగా ఏర్పాటు చేసిన షెటర్లను, షెడ్లను తొలగించేలా పనిచేయాలని కోరారు.