చర్లపల్లి, జూలై 4 : బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతవరణంలో జరుపుకొవాలని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ అవరణలో బోనాల నిర్వహణలో భాగంగా ఆలయ కమిటీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల పండుగను భక్తి భావంతో జరుపుకోవాలని, ఆలయాల వద్ద పెట్రోలింగ్‌ను పెంచడంతో పాటు నిఘాను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
బోనాల నేపథ్యంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పోలీసుల భాగస్వామ్యంతో పనిచేయాలని, అదేవిధంగా తగిన సలహాలు, సూచనలు చేయాలన్నారు. ముఖ్యంగా బోనాల సందర్భంగా నిర్వహించే ఉరేగింపులో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలను ఉల్లంగిస్తే తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు సుధాకర్‌రెడ్డి, వెంకన్న, సాయిలుతో పాటు వివిధ అలయాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.