HCU land Issue | కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 2 : జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ హెచ్‌సీయూ విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయమే హెచ్‌సీయూ క్యాంపస్‌ను వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారని తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని నిరసిస్తూ పోరాడుతున్న విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం బాధాకరమని కూకట్పల్లి జనసేన ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్‌సీయూ భూములను అమ్మితేనే ఖజానా నిండుతుందని.. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. భూముల కోసం పోరాడుతున్న విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టడం దుర్మార్గమన్నారు. విద్యార్థులపై కేసులను వెంటనే కొట్టివేయాలని, 400 ఎకరాల యూనివర్సిటీ భూములను అమ్మడం ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.