కీసర, సెప్టెంబర్ 19 : అక్రమంగా నిలువ చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బోగారం గ్రామానికి చెందిన దాసరి జంగయ్య వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా నిలువ ఉంచిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యాన్ని అమ్మినా కొనుగోలు చేసినా కఠన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.