WPL Final : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు శివమెత్తారు. వచ్చినవాళ్లు వచ్చినట్టు దంచేయగా డబ్ల్యూటీసీ టైటల్ పోరులో ఢిల్లీ రికార్డు స్కోర్‌తో చరిత్రకెక్కింది. ఓపెనర్లు శుభారంభమివ్వగా.. జెమీమా రోడ్రిగ్స్(57) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఒత్తిడికి లోనైన ఆర్సీబీ బౌలర్లను ఆఖర్లో లారా వొల్వార్డ్త్(44), చిన్నెల్లీ హెన్రీ(32 నాటౌట్) బెంబేలెత్తించారు. డీక్లెర్క్ వేసిన 18వ ఓవర్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన హెన్రీ 24 రన్స్ రాబట్టగా.. చివరి ఓవర్లో పది రన్స్ రావడంతో బెంగళూరుకు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
డబ్ల్యూటీసీలో కప్ కోసం నిరీక్షిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లో భారీ స్కోర్‌తో ఆర్సీబీకి సవాల్ విసిరింది. టాస్ ఓడిన ఢిల్లీ తొలి రెండు ఓవర్లలో 8 పరుగులే చేసింది. లారెన్ బెల్ తొలి ఓవర్లో సింగిల్, ఫోర్.. ఆపై సయాలీ ఓవర్లో మూడు రన్స్ మాత్రమే వచ్చాయి. అనంతరం బెల్ ఒకటే పరుగు ఇవ్వగా.. కానీ, నాలుగో ఓవర్లో ఓపెనర్ లిజెల్లీ లీ(37) రెచ్చిపోయింది.
Innings Break! @DelhiCapitals register the highest total in a #TATAWPL Final 🔥
Will they defend it or will #RCB chase it down? 🤔
History awaits on the other side ⏳
Scorecard ▶️ https://t.co/9sgUo0YqOI#TATAWPL | #ClaimTheCrown | #RCBvDC pic.twitter.com/3CxX6qyQE8
— Women’s Premier League (WPL) (@wplt20) February 5, 2026
సయాలీ ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదింది. షపాలీ వర్మ(20) సైతం దూకుడు పెంచి రెండు ఫోర్లు కొట్టింది. కానీ, పవర్ ప్లే చివరి ఓర్లో అరుంధతి రెడ్డి ఆమెకు చెక్ పెట్టింది. షాట్ ఆడాలనుకున్న తను.. వికెట్ కీపర్ రీచా చేతికి చిక్కడంతో 49 వద్ద ఢిల్లీ తొలి వికెట్ పడింది.
Bigger the stage 🤝 Bigger the impact
Captain Jemimah Rodrigues with a superb knock 🫡
Her 5⃣th #TATAWPL FIFTY 👏
Updates ▶️ https://t.co/9sgUo0YqOI#ClaimTheCrown | #RCBvDC | #Final | @DelhiCapitals | @JemiRodrigues pic.twitter.com/p0XfPpaAlR
— Women’s Premier League (WPL) (@wplt20) February 5, 2026
అనంతరం.. లారా వొల్వార్డ్త్(44), లీ ఇన్నింగ్స్ నిర్మించారు. లీని ఔట్ చేసి బ్రేకి చ్చింది. అయితే.. జెమీమా రోడ్రిగ్స్(57) రాకతో ఢిల్లీ స్కోర్ బోర్డు పరుగందుకుంది. కచ్చితమైన టైమింగ్‌తో బౌండరీలు సాధించిన జెమీమా బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుంది. సయాలీ ఓవర్లో ఫుల్‌టాస్‌ను సిక్సర్‌గా మలచాలనుకున్న జెమీమా బౌండరీ వద్ద డీక్లెర్క్ చేతికి చిక్కింది. దాతో.. మూడో వికెట్ 76 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన చిన్నెల్లీ హెన్రీ(35 నాటౌట్).. మొదట తడబడినా డీక్లెర్క్ ఓవర్లో రెచ్చిపోయింది. తొలి బంతికి ఫోర్ బాదిన తను.. ఆ ఓవర్లో నాలుగు ఫోర్లు, సిక్సర్‌తో 24 రన్స్ పిండుకుంది. సయాలీ సిక్సర్ బాదగా.. ఐదో బంతిని లారా ఫోర్‌గా మలిచింది. దాంతో.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఢిల్లీ 203 పరుగులు చేసింది.
We’ll let you do the math! 🔢😌
Chinelle Henry’s power was on full display in that massive 19th over 🔥
Updates ▶️ https://t.co/9sgUo0YqOI#TATAWPL | #ClaimTheCrown | #RCBvDC | #Final | @DelhiCapitals pic.twitter.com/MWZtB2lobq
— Women’s Premier League (WPL) (@wplt20) February 5, 2026