Shed Construction | జీడిమెట్ల, జూలై 6 : గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ పరిధి రోడామేస్త్రీనగర్ ఎ హజీ అలీ మజీద్ ఎదురుగా ఉన్న విద్యుత్ హై టెన్షన్ స్తంభం కింద ఓ వ్యక్తి అక్రమంగా రూం (రేకులషెడ్) నిర్మించారని కొందరు స్థానికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసినా ఈ విషయంపై అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, స్థానిక కార్పొరేటర్ రషీదాబేగంలు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి సంబంధిత విద్యుత్, జీహెచ్ఎంసీ, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు.
Sigachi Industries | సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 41కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 9 మంది ఆచూకీ
Dalai Lama | ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు