Illegal constructions | దుండిగల్, మార్చి : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇవాళ కూల్చివేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో అనుమతులకు మించి నిర్మించిన ఓ బహుళ అంతస్తుల నిర్మాణాన్ని సిబ్బంది కూల్చివేశారు. అనంతరం ప్రగతి నగర్ కమాన్ (బావర్చి హోటల్) ఎదురుగా బస్ స్టాప్ వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వాణిజ్య సముదాయాల(షెట్టర్లు)ను తొలగించారు.
అయితే బహుళ అంతస్తుల భవనం పట్ల కఠినంగా వ్యవహరించి గ్యాస్ కట్టర్లతో స్లాబును కట్ చేసిన సిబ్బంది షట్టర్లను మాత్రం నామమాత్రంగా తొలగించడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాల విషయంలో అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలని, కొందరి పట్ల మాత్రమే కక్షపూరితంగా వ్యవహరిస్తూ, మరికొందరిని పట్ల చూసి చూడనట్లు వదిలేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు.
ఎటువంటి ఆధారం లేకుండా ఓ వ్యక్తి సుమారు 12 షెటర్లు నిర్మించగా.. చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్
Amitabh Bachchan: షారూక్, విజయ్ను దాటేసిన బిగ్ బీ.. 120 కోట్ల ట్యాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్