Pensions | నేరేడ్మెట్, జూలై 16 : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆగస్టు 13న ఎల్బీ స్టేడియంలో చలో హైదరాబాద్‌కు సంబంధించి జిల్లా సన్నాహక సభ బుధవారం ఎస్ఎస్ గార్డెన్ వినాయకనగర్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర వైకల్యం కలిగిన కండరాల క్షీణత ఉన్న వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
అధికార పక్షం అన్యాయం చేస్తుంటే ప్రతిపక్షం నోరు విప్పడం లేదని మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prada | చెప్పుల ప్రదర్శనతో వివాదం వేళ.. కొల్హాపూర్‌ని సందర్శించిన ప్రాడా ప్రతినిధుల బృందం
Viral video | లిఫ్టులో గ్యాంగ్ వార్.. తప్పతాగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు.. చెంపదెబ్బలు..!
KCR | ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం