Farmers | ఘట్ కేసర్, మే 29 : ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మాదారం, ఎదులాబాద్, అంకుషాపూర్ లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ ఎల్ సుగుణబాయి సంబంధిత అధికారులతో కలిసి గురువారం సందర్శించి పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అధికారుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు జాగ్రత్తలు సూచనలు చేయడంతోపాటు తేమ, తాలు, మట్టి పెడ్డలు లేని నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కోరారు.
ఈ విషయంలో రైతులను జాగ్రత్తపరిచేందుకు సంబంధిత వ్యవసాయ సహాయ అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యత ప్రమాణాలు కలిగిన 17 తేమ శాతంలోపు ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ చార్జీల ద్వారా రైతులకు సమాచారం తెలియపరిచి అప్రమత్తం చేయాలన్నారు. దీంతో రైతులు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకొని తమ ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోగలుగుతారని సూచించారు. పాడి కాంట్రాక్టర్ కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్కు రవాణా చేసేందుకు ఆర్టీవో సహకారంతో తగినన్ని వాహనాలను సమకూర్చుకోవాలన్నారు.
కొనుగోలు కేంద్రంలో అవసరమైనంత హమాలీలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వడ్లు దింపుకొనే సమయంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం కొన్న వెంటనే ట్యాబ్ (ఆన్లైన్) లో రైతుల వివరాలను నమోదు చేయాలని చెప్పారు. జిల్లా అధికారులు ధాన్యం సేకరణ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ కొనుగోలులో ఎలాంటి అవాంతరాలు రాకుండా పర్యవేక్షించాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల లోపు నేరుగా వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ అధికారులు, రైతులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
PM Modi | ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం : ప్రధాని మోదీ
Sunkishala | సిటీకి సుంకిశాలే శరణ్యం.. కేసీఆర్ దిశలోనే కాంగ్రెస్ సర్కారు
Navy plane Crashes | ఘోర ప్రమాదం.. కూలిన నేవీ విమానం