Jalamandali Office | జీడిమెట్ల, జూన్ 22 : సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ రాజీవ్ గృహకల్ప వాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించకపోతే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని మేడ్చల్ జిల్లా ఫిషరీస్ డీఎఫ్సీఎస్ కమిటీ చైర్మన్ మన్నే రాజు అన్నారు.
రాజీవ్ గృహకల్పలో గత కొన్ని నెలలుగా డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉండటంతో అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలుసుకున్న మేడ్చల్ జిల్లా ఫిషరీస్ డీఎఫ్సీఎస్ కమిటీ చైర్మన్ మన్నే రాజు , సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ స్థానిక నాయకులతో కలిసి పర్యటించి పరిశీలించారు.
ఈ సందర్భంగా మన్నే రాజు మాట్లాడుతూ.. జలమండలి అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదన్నారు. రాజీవ్ గృహకల్ప వాసులు ఇబ్బందులను వారి సమస్యలను పట్టించుకోకపోతే స్థానిక ప్రజలతో కలిసి జలమండలి ఆఫీసు ముట్టడిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అధికారులు పని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తారా సింగ్, బద్రి, కొత్తిమీర శీను, నరసింహ, రాణి, మధు, మల్లేష్, సింహాచలం రమాదేవి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
Peddagattu | జీఓ ఇచ్చారు.. నిధులు మరిచారు.. కాంగ్రెస్ హయాంలో లింగమంతుల స్వామికి శఠగోపమేనా?
Bigg Boss 9 | బిగ్ బాస్ సందడికి టైం ఫిక్స్ అయినట్టేనా.. కంటెస్టెంట్స్ ఎవరెవరంటే..!
Road Accident | వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి