Hyderabad Fire Accident | హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్పల్లిలోని పద్మావతి ప్లాజాలో ఉన్న మొబైల్ షాపులో మంటలు చెలరేగాయి. దీంతో షాప్ తగులబడింది. ఈ అగ్నికీలల కారణంగా మంటలు పక్క షాపులకు కూడా వ్యాపించాయి. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది.
పద్మావతి ప్లాజాలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో భయాందోళనలకు గురైన స్థానికుు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మొబైల్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.