MLA Bandari Lakshma Reddy | చర్లపల్లి, జూలై 19 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాలనీలలో నెలకొన్న సమస్యలను దశలవారిగా పరిష్కరించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్, లక్ష్మినర్సింహ్మకాలనీ సంక్షేమ సంఘం నాయకులు, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో నెలకొన్న సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లక్ష్మినర్సింహ్మాకాలనీలో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకొవడంతోపాటు ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల నిర్మాణం పనులు చేపడుతామన్నారు. అదేవిధంగా వీధి దీపాల నిర్వహణను మెరుగుపరచడంతోపాటు మంచినీటి సమస్యలు తలేత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొవాలని సూచించారు. అనంతరం కాలనీలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు హజరుకావాలని కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నేమూరి మహేశ్‌గౌడ్, కాలనీ ప్రధాన కార్యదర్శి సుధాకర్, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, అనసూయ, స్వరూప, పద్మ, సరస్వతి, జ్యోతి, పద్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.
Yadagirigutta : యాదగిరిగుట్టలో రూ.5 వేలతో గరుఢ టికెట్ !
అప్రెంటీస్ విధానంలో టీజీఎస్ఆర్టీసీలో దరఖాస్తుల ఆహ్వానం
Online scams | ఆన్ లైన్ మోసాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. షీ టీం సీనియర్ సభ్యురాలు స్నేహలత