Bandari Lakshma Reddy | రామంతాపూర్, మే 17 : మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బండారు రాజిరెడ్డి బాటలో నడుస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. నిబద్ధత కలిగిన నాయకుడు తన సోదరుడు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డిని కోల్పోవడం బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ రామంతాపూర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద గాంధీ నగర్లో వివిధ పార్టీల నాయకులు కుల సంఘాల నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బండారి రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తన సోదరుడు దివంగత నేత బండారి రాజిరెడ్డి ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని.. ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. తాను తన సోదరుని బాటలో నడుస్తూ ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు గంధం నాగేశ్వరరావు, సర్వ బాబు యాదవ్ పాలకూర శ్రీకాంత్ గౌడ్,ముత్యాల నరసింహ, సూరం శంకర్, సంపత్ రావు, గడ్డం రవికుమార్, మురళి గౌడ్, ధీటి మల్లయ్య, శ్రీనివాస్ యాదవ్ ,విజయ, బొబ్బల వెంకటరెడ్డి, వినోద్ ముదిరాజ్ , నరేష్ జంగిర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Inmates Escaped: అమెరికా జైలు నుంచి 10 మంది ఖైదీలు పరారీ
Karimnagar Simha Garjana | కరీంనగర్ సింహ గర్జన.. ఉద్యమ రథసారథి కేసీఆర్ ప్రసంగం ఇదీ..
Tortoise | ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ఈది.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తాబేలు