MLA KP Vivekanand | దుండిగల్, జూన్ 14 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 20వ డివిజన్, కాకతీయ నగర్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శనివారం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గండిమైసమ్మ – బాచుపల్లి ప్రధాన రహదారిలోని డా.రెడ్డీస్ ల్యాబ్ వద్ద సిగ్నల్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కాలనీలో మౌళిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్డు పనులు, పార్కులను అభివృద్ధి చేయాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోజు రోజుకు వెలుస్తున్న కొత్త కాలనీల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పరుస్తున్నామని, రానున్న రోజుల్లో కాకతీయ నగర్ కాలనీలో అన్ని రకాల మౌళిక వసతులను కల్పిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ ప్రశాంత్, మేనేజర్ పవన్, డీఈ వసంత, మేనేజర్ జై రాజ్, శానిటేషన్ ఇంచార్జ్ సుకృత రెడ్డి, విద్యుత్ ఏఈ శశిధర్, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు పైడి మాధవి, బాలాజీ నాయక్, పెద్దిరెడ్డి సుజాత, బొర్రా దేవి చందు ముదిరాజ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు చంద్రగిరి జ్యోతి సతీష్, నాయకులు సాంబ శివ రెడ్డి, దండుగులస్వామి, వైయస్ , ప్రవీణ్, అనిల్, సతీష్ రెడ్డి, ప్రదీప్, బొబ్బ శ్రీనూ, బిక్షపతి, మేకల మధుసూదన్, దుసకంటి వెంకటేష్, విద్య సాగర్, జలగం చంద్రయ్య, కాకతీయ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
కుట్రతోనే కేటీఆర్‌కు నోటీసులు.. ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్‌వి డైవర్షన్ రాజకీయాలు.. మధుసూదనాచారి
Kaleru Venkatesh | పేదలకు ఆపత్కాలంలో ఆర్థిక చేయూత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్