MLA Bandari Lakshma Reddy | రామంతపూర్, ఏప్రిల్ 4 : ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ రామంతపూర్ ఇందిరానగర్‌లో 85 లక్ష రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కార్పొరేటర్ శ్రీవాణి మాట్లాడుతూ.. డివిజన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వన్నాల దేవేందర్ రెడ్డి, బీ ఆర్ఎస్ నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి, సర్వ బాబు యాదవ్ , మంజుల సూరం శంకర్, శ్రీనివాస్ రెడ్డి , కైలాసపతి గౌడ్ ,రేపాక కుమారస్వామి, జహంగీర్, బిజెపి నాయకులు ముత్తినేని జగదీష్ రేవు , నరసింహ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Passengers | 40 గంటలుగా తుర్కియే ఎయిర్‌పోర్ట్‌లోనే.. వసతుల లేమితో భారతీయ ప్రయాణికుల అవస్థలు
Alampur | అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గవ్వల శ్రీనివాసులు
Taj Mahal: టికెట్ సేల్స్ ద్వారా ఆదాయం.. టాప్‌లో తాజ్‌మహల్