Hydra officials | కుత్బుల్లాపూర్, జూన్ 3 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గుండ్ల పోచంపల్లి శివారు ప్రాంతంలో లింగం చెరువుకు ఆనుకొని ఉన్న బఫర్ జోన్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను మంగళవారం హైడ్రా అధికారులు పరిశీలించారు. ఎఫ్టీఎల్ బఫర్‌జోన్ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను పరిశీలించారు.
ఈ క్రమంలో ఫిర్యాదులు అందిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించిన అనంతరం ఎఫ్డీఎల్ కు దూరంలో నిర్మాణాలు జరుగుతున్నాయని, ఎలాంటి పరిస్థితుల్లో చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాలు పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులతో పాటు ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా