Quthbullapur | ప్రభుత్వ భూమి కబ్జాయత్నాలపై హైడ్రా కేసు నమోదు అయింది నరసింహ తాసిల్దార్ రెహమాన్ వివరాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్ సర్వేనెంబర్ 307 లో కొంతకాలంగా కబ్జాయత్నాలు సాగుతున్నాయి. ఇటీవల కొంతకాలంగా రాత్రిపూట టిప్పర్లతో మట్టి పోసి చదును చేస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలపై నిగా పెట్టినా రెవెన్యూ సిబ్బంది బుధవారం టిప్పర్లను అడ్డుకున్నారు.ఈ విషయాన్ని భద్రతా పోలీసులకు హైడ్రాధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని7 టిప్పర్లు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.