Badmintonship Competetions | నేరేడ్మెట్, మే 26 : హైదరాబాద్ జిల్లా ఛాంపియన్షిప్ పోటీలు జూన్ 5వ తేది నుంచి 8వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరి కానూరి వంశీధర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు సబ్ జూనియర్, జూనియర్, మెన్, ఉమెన్, మాస్టర్ విభాగాలుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
బండ్లగూడ జాగీర్‌లోని గేమ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీలు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారులకు మాత్రమేనని సూచించారు. ఇతర జిల్లా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అనర్హులన్నారు. అయితే క్రీడాకారులు ఏదైనా ఒక జిల్లాలోనే పాల్గొనాలని తెలిపారు.
ఆసక్తి ఉన్న క్రీడాకారులు జూన్ 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం బ్యాట్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. ఈ పోటీలు గేమ్‌పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
Nakirekal : తీవ్ర సంక్షోభంలో ప్రభుత్వ పాఠశాల విద్య : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
Godavarikhani | కాళేశ్వరం పుష్కరాల సేవలో భ్రమరాంభిక సేవకులకు ప్రశంసలు