Adultrated Toddy | కేపీహెచ్బీ కాలనీ, జూలై 14: కూకట్పల్లి హైదర్ నగర్లోని కల్తీ కల్లు ఘటనలో మరో గృహిణి కన్నుమూసింది. కేపీహెచ్బీ కాలనీ సెక్టార్ ఎస్ఐ మన్యం తెలిపిన వివరాల ప్రకారం పుట్టి బసవయ్య, గంగామణి (40) దంపతులు హైదర్ నగర్ కాలనీలో నివసిస్తున్నారు. గంగాభవాని హౌస్ కీపింగ్ పనులు చేస్తుంది.
కల్లు తాగే అలవాటు ఉండటంతో.. గంగామణి ఈ నెల 6న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో హైదర్ నగర్లోని కల్లు డిపోకు చేరుకొని కల్లు తాగింది. ఇంటికి రాగా రాత్రి 11 గంటల సమయంలో వాంతులు విరేచనాలు రావడంతో ఆమెను వెంటనే సమీపంలోని పూజా వైద్యశాలకు, తర్వాత బాచుపల్లిలోని మమతా వైద్యశాలకు తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న గంగామణి ఈ నెల 13న రాత్రి 11 గంటలకు చనిపోయినట్లు నిర్ధారించారు.
తన భార్య కల్తీ కల్లు తాగి మృతి చెంది ఉండవచ్చు అని పేర్కొంటూ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Juluri Gourishankar | జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ ఆవిష్కరణ
Student | అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత.. యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని