MLA Bandari lakshma reddy | విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం , బడి బాట సందర్భంగా మండల పరిషత్ ప్రైమరీ స్కూల్, చిలకానగర్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫారంలను పంపిణీని గురువారం కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు మన దేశానికి ఎంతోమంది మేధస్సు కలిగిన మేధావులను అందించాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు విశాలమైన క్రీడా ప్రాంగణాలను కలిగి ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు దేశంలో అత్యున్నత స్థాయి సర్వీసులను సాధించిన వారు ఎందరో ఉన్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజి రెడ్డి , పాఠశాల ఉపాధ్యాయులు, బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
నాచారంలో పంపిణీ..
నాచారంలోని ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరచాలని, అదేవిధంగా విద్యార్థులు ఉత్తమ లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
Ahmedabad plane crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nidamanoor : భూ భారతితో భూములకు భద్రత : వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం
Surekha Vani | సురేఖా వాణి చేసిన పనికి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్