హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డిఅన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని తెలిపారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 8,9 డివిజన్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పనులు సకాలంలో నాణ్యతతో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు, అధికారులను ఆదేశించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మిరవిగౌడ్, 8,9వ డివిజన్ల కార్పొరేటర్లు సీసా వెంకటేశ్ గౌడ్, లావణ్య రెడ్డి, మున్సిపల్ అధికారులు, టీఆర్ఎస్ నేతలు శేఖర్ రెడ్డి, సమత, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.