జీడిమెట్ల, ఆగస్టు : తన జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలకు బదులుగా గీఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టి వికలాంగులకు త్రీ వీల్ మోటార్ సైకిళ్ళు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ గుడిమెట్ల హేమలతా సురేష్‌రెడ్డి స్పందించారు.
సోమవారం కృషి కాలనీలో ఉన్న కార్పొరేటర్ కార్యాలయంలో సూరారం శ్రీషిర్డి సాయిబాబానగర్‌కు చెందిన దివ్యాంగులు వెంకటేష్, సాయినాథ్, అన్వర్, జగదీష్‌లకు మోటార్ సైకిళ్ళను కార్పొరేటర్ హేమలత అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యూసుఫ్, విజయ్, రాజు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.