Bike Thefts | జగద్గిరిగుట్ట, ఆగస్టు 30 : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై బాలానగర్ ఏసీపీ నరేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బైకుల చోరీలకు పాల్పడిన శ్రీధర్, కిషన్, మణికంఠ, శ్రీనివాస్, నాగుర్‌వలి అరెస్టయ్యారు. దొంగలు కరీంనగర్, గుంటూరుకు చెందినవారు.
వీరంతా ఏసీ మెకానిక్, ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కూకట్పల్లి, ఆల్విన్ కాలనీలో నివాసముంటూ టీంగా ఏర్పడ్డారు. నిందితులు పలువురికి బైకుల ఫొటోలు పంపి అడ్వాన్సులు తీసుకున్నారు. వాహన తనిఖీల్లో శ్రీధర్ పట్టుబడగా పోలీసు విచారణలో ఈ వివరాలు వెల్లడయ్యాయని ఏసీపీ నరేశ్ రెడ్డి పేర్కొన్నారు. నిందితులను రిమాండ్ కు పంపామన్నారు. ఈ ప్రెస్మీట్లో ఇన్స్పెక్టర్లు నరసింహ, నరేందర్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Harish Rao | పెట్రోల్‌కు రేవంత్ డబ్బులు ఇస్తున్నాడా..? పోలీసులకు హరీశ్‌రావు సూటి ప్రశ్న
పార్టీ మారితేనే సహకారం.. లేదంటే తిరస్కారం..