Fire Service Week | శామీర్‌పేట, ఏప్రిల్ 14 : శామీర్‌పేట ఫైర్ స్టేషన్లో అగ్ని మాపక వారోత్సవాలు ఇవాళ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఫైర్ సర్వీస్ వీక్ పేరుతో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు. వారోత్సవాల వాల్ పోస్టర్‌ను స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వెంకటరమణారెడ్డి శామీర్‌పేట సీఐ శ్రీనాథ్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్మారక ఊరేగింపు, అగ్నిమాపక శాఖ త్యాగాలు, సేవలు, ప్రజా భద్రతపై అవగాహన కల్పించారు. ఈ పోస్టర్ ప్రజల్లో అగ్ని ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి ముఖ్యమైన చర్యలు, ఎమర్జెన్సీ నంబర్లు, ఫైర్ సేఫ్టీ టిప్స్ తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనాథ్, ఎస్ఐ హారిక, మాజీ సర్పంచ్ కుమార్, వెంకటేశ్, సిబ్బంది పాల్గొన్నారు.