మూసాపేట మార్చి 23 : నిర్మానుష్య ప్రదేశంలో పార్క్ చేసిన వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగిన (Fire breaks)సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఐడియల్ చెరువు సమీపంలో ప్రవేట్ బస్సు పార్కింగ్ ఉంది. అక్కడ బస్సులతో పాటు డీజిల్ ట్యాంకర్ పార్క్ చేశారు. అయితే ట్యాంకర్ లో మిగిలిపోయిన డీజిల్ తీసే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో డీజిల్ ట్యాంకర్ తో పాటు పక్కనున్న కారుకు సైతం మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి, కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.