Fire Accident | జగద్గిరిగుట్ట (క్రైమ్ స్పాట్), జూలై 16 : తిను బండారాల చిప్స్ గోదాంలో అగ్ని ప్రమాదం జరుగగా.. సరుకు మొత్తం కాలిపోయింది. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి, పాపిరెడ్డి నగర్లో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు సూర్య ఎంటర్ ప్రైజెస్(ఆలు చిప్స్ కంపెనీ) పేరుతో పాపిరెడ్డి నగర్లో గోదాం నిర్వహిస్తున్నారు.
ప్రమాదవశాత్తు బుధవారం తెల్లవారుజామున గోదాములో మంటలు అంటుకున్నాయి. నివాస ప్రాంతాల్లో గోదాము ఉండటంతో కాలనీలో పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సంఘటనలో నిలువచేసిన చిప్స్ సామాగ్రి కాలిపోయింది.
స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసారు. ప్రమాదంలో సామాగ్రి కాలిపోయినా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
నివాసాల నడుమ ఇలాంటి పరిశ్రమలు గోదాములు కొనసాగకుండా చూడాలని స్థానికులు కోరారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Prada | చెప్పుల ప్రదర్శనతో వివాదం వేళ.. కొల్హాపూర్ని సందర్శించిన ప్రాడా ప్రతినిధుల బృందం
Viral video | లిఫ్టులో గ్యాంగ్ వార్.. తప్పతాగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు.. చెంపదెబ్బలు..!
KCR | ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం