Farmers | శామీర్పేట, జూలై 8 : రైతులకు వ్యవసాయంలో సలహాలు, సూచనలు పొందేందుకు సాంక్షేతిక పరిజ్ఞానంపై అవగాహన అవసరమని ఉద్యానశాఖ జేడీ బాబు అభిప్రాయపడ్డారు. రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ పద్దతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారుల సలహాలు, సూచనలను రైతు నేస్తం ద్వారా తీసుకోవాలన్నారు. అందుకోసం రైతులకు సాంకేతిక పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యాన శాఖ ద్వారా రైతులకు అందిస్తున్న పథకాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖాధికారి శ్రీధర్, మండల వ్యవసాయ అధికారి రమేశ్, ఉద్యాన శాఖాధికారి రామకృష్ణ, విస్తరణ అధికారి సుధీర్, రైతులు పాల్గొన్నారు.
Amberpet | రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
Trade Deal | త్వరలో అమెరికాతో భారత్తో వాణిజ్య ఒప్పందం.. కీలక సూచనలు చేసిన జీటీఆర్ఐ..
Horror | దెయ్యం వదిలిస్తామంటూ నాలుగు గంటలు చిత్రవధ.. దెబ్బలు తాళలేక మహిళ మృతి..!