Chamakura Mallareddy | శామీర్పేట, ఫిబ్రవరి 23 : ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికీ అవసరమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహాశివరాత్రి జాతర సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి కల్యాణం, అగ్ని గుండాలు, గొలుసులు తెంపుట, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపల్ మాజీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్ రావు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం వ్యవస్థపాక అధ్యక్షుడు బొల్లె బోయిన చంద్రశేఖర్ యాదవ్, కౌన్సిలర్ రాజ్ కుమార్ యాదవ్, సురేశ్, నర్సింగ్ రావు గౌడ్, వీరారెడ్డి, భారత్ సింగ్, వెంకట్ రెడ్డి, దయసాగర్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.