Chamakura Bhadrareddy | ఘట్ కేసర్, ఫిబ్రవరి 16 : ప్రతీ ఒక్కరు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుని జాతీయ స్థాయికి ఎదగాలని బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి చామకూర భద్రారెడ్డి తెలిపారు. ఘట్ కేసర్ మున్సిపాలిటీ మాదారంలో నిర్వహిస్తున్న మాదారం ప్రీమియర్ లీగ్ సీజన్-6 క్రికేట్ క్రీడలను ఇవాళ ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తి కలిగిన ప్రతి ఒక్కరు అన్ని రంగాలలో రాణిస్తారని తెలిపారు. క్రీడల వల్ల మనిషికి శారీరక, మానసిక ఆరోగ్యం దృఢపడుతుందని చెప్పారు. క్రీడల వల్ల మానవ సంబంధాలు బలపడతాయని.. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. అందులో భాగంగానే మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో క్రికెట్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ యాదగిరి, మాజీ కౌన్సిలర్ బండారి అంజనేయులు గౌడ్, నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Kishan Reddy | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా : కిషన్ రెడ్డి
MLA Vivekanand | ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాం : ఎమ్మెల్యే వివేకానంద్
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్