CM Relief Fund | సీఎం సహాయనిధి పథకాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, దుండిగల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ అన్నారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, శంభీపూర్లోని కార్యాలయంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చొరవతో 15 మందికి మంజూరైన రూ.3 లక్షల 39 వేల సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు ఇవాళ అందజేశారు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ఆపదలో ఉండి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ.. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ తాజా మాజీ కౌన్సిలర్లు మహేందర్ యాదవ్, భారత్ కుమార్, సీనియర్ నాయకులు ఉట్ల శ్రీహరి, గణేష్తో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Pooja Hegde | శ్రీకాళహస్తీ రాహుకేతు పూజలో పాల్గొన్న పూజా హెగ్డే
A Raja: బొట్టు పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు.. డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు