Educational Institutions | జగద్గిరిగుట్ట, జూన్ 16 : జగద్గిరిగుట్ట ప్రాంతానికి కేటాయించిన విద్యాసంస్థలను స్థానికంగానే ఏర్పాటు చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. శామీర్ పేట్లో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల, మహిళా డిగ్రీ కళాశాల వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
జగద్గిరిగుట్ట సర్వే నెంబర్ 348/1లో ప్రభుత్వ భూములు కబ్జాలవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కేటాయించిన చోట ఎందుకు విద్యాసంస్థలను ఏర్పాటు చెయ్యడం లేదని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ కాలేజీలు నిర్మిస్తున్న నేపథ్యంలో జగద్గిరిగుట్టలో ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ గురుకులాలకు స్థలం కేటాయించాలని సూచించారు.
జగద్గిరిగుట్టకు కేటాయించి వేరే చోట నిర్వహిస్తున్న విద్యా సంస్థలను మళ్లీ గుట్టలోనే ఏర్పాటుచేయాలన్నారు. ఐఎన్టీయూసీ, దళిత సంఘాల నేతలు ఐలయ్య, అమర్ బాబు, జేమ్స్ పాల్గొన్నారు.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత