Drainage Water | చర్లపల్లి, మార్చి 22 : చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ సాయినగర్‌లో ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారులలో డ్రైనేజీ మురుగునీరు ఏరులై పారుతుండటంతో కాలనీవాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నీరు నిలిచిపోయింది. దీనికి తోడుగా మురుగునీరు ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారులలో పేరుకుపొవడంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపొవడంతో కాలనీవాసులు ఇండ్లలోనే ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో కాలనీలో బాక్స్ డ్రైయిన్ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరినప్పటికి పనులు చేపట్టకపొవడంతో మురుగునీరు ఏరులై పారుతుందని, ఇప్పటికైన కాలనీలో మురుగునీరు, వర్షం నీరు నిలువకుండా శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకొవాలని కాలనీవాసులు కొరుతున్నారు.