MLA KP Vivekanand| కుత్బుల్లాపూర్, ఏప్రిల్30 : అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక స్ప్రింట్ డయాగ్నోస్టిక్ 6వ శాఖను సుచిత్ర సర్కిల్లో ఇవాళ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి ఆరోగ్య సేవలు ఎంతో కీలకమన్నారు.
మారుతున్న జీవనశైలితో కొత్తకొత్త ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు (డయాగ్నోస్టిక్ సెంటర్లు) ముఖ్య భూమిక పోషిస్తున్నాయని, నూతన టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నాయన్నారు. ఇవి ప్రజలకు ఎంతగానో అవసరమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఎస్ఆర్ పౌల్ట్రీ ఫామ్స్ డైరెక్టర్ బ్రహ్మానంద రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నేతలు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, మధుసూదన్ రాజ్, మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Mark Carney | ‘కార్నీ’వాల్.. టైమ్ టు విన్ పాటకు స్టెప్పులేసిన కెనడా ప్రధాని.. VIDEO
Dr. Haripriya | వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లాలి : డాక్టర్ హరిప్రియ
CITU | కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం