చర్లపల్లి, సెప్టెంబర్ 25 : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకొవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సత్యం, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్‌ల కోరారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు రవాణా, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు ప్రజా రవాణా సౌకర్యం లేకపొవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
రైల్వే స్టేషన్‌కు ఫలక్నామా, మేడ్చల్, లింగంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్‌ల నుంచి ఎంఎంటీఎస్ రైలులు నడిచే విధంగా చర్యలు తీసుకొవాలని, ఎంఎంటీఎస్ రాకపోకలకు ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని, మెట్రో రైలు విస్తరణ పనులను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోమటి రవి, యాదగిరిరావు, శంకర్, సబిత, యాదగిరిరావు, శ్రీమన్నారాయణ, సోమయ్యచారి, శరత్, గణేశ్, ఎమ్మెస్.రావు, సఫీయా, దుర్గయ్య, జీవీ.రావు, లీలావతి, నర్సింగ్‌రావు, ప్రభాకర్, ఆశోక్, మణికంఠ, నర్సింహ్మ, ఆదామ్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.