సిద్దిపేట, మార్చి 19( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు ఆయిల్‌పామ్ పరిశ్రమ.సంప్రదాయ పంటల సాగుతో పాటు వాణిజ్య పంటల సాగును కేసీఆర్ ప్రోత్సహించారు. రైతులకు లాభాలు చేకూర్చేందుకు సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌పామ్ పంట సాగును బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహించింది. సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్‌పామ్ అంటే ఏంటో తెలియని రైతులకు ఆ పంటను పరిచయం చేశారు కేసీఆర్. కేసీఆర్,హరీశ్‌రావు ప్రోత్సాహంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు వచ్చారు.
సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామంలో రూ. 300 కోట్లతో ఫామాయిల్ ఫ్యా క్టరీ నిర్మాణం చేశారు. ఫలితంగా ఆయిల్‌పామ్ తోటల పెంపకం రైతుల జీవితాల్లో కొత్త వెలుగు నింపుతున్నది. సిద్దిపేట జిల్లాలో 12వేల ఎకరాలకు 3600 ఎకరాల్లో పంట కొతకొచ్చింది. 940 మంది రైతు ల నుంచి 4వేల టన్నుల ఆయిల్‌పామ్ గెలలు దిగుబడి వచ్చింది. ఈ గెలలను నర్మెట ఫ్యాక్టరీకి రిఫైనరీకి రైతులు తరలించారు. ఆయిల్‌పామ్ తోటల పెంపకంతో సిద్దిపేట జిల్లా రైతులకు ఇప్పటికే కోటి రూపాయల ఆదాయం వచ్చింది. ఈ డబ్బు లు రైతుల ఖాతాలో నేరుగా జమయ్యాయి.
సిద్దిపేట జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల్లో మరో 3వేల టన్నుల వరకు ఆయిల్ గెలలు దిగుబడి రాగా, వాటిని నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి తరలించారు. నర్మెట ఫ్యాక్టరీలో ఎనిమిది టన్నుల వరకు ఆయిల్‌పామ్ గెలల క్రషింగ్ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో నడిబొడ్డున నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు ఎంతగానో కృషి చేశారు. ఎప్పటికప్పుడు ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించి అందుబాటులోకి తెచ్చారు.
అంతేకాకుండా సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌పామ్ తోటల పెంపకానికి తరుచూ రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రోత్సహించారు. హరీశ్‌రావు కృషితో సిద్దిపేట జిల్లాలో 3600 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు రైతులు పెంచారు. సాగుచేసిన రైతులతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించి సాగులో మెళకువలు, తదితర ఆంశాలపై సంబంధిత అధికారులతో, శాస్త్రవేత్తలతో రైతులకు హరీశ్‌రావు అవగాహన కల్పించారు. దీంతో సిద్దిపేట జిల్లా ఆయిల్‌పామ్ తోటల పెంపకానికి నిలయంగా మారింది. పంట చేతికి రావడంతో రైతులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, హరీశ్‌రావులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

Oilpalm
28 టన్నుల పంట దిగుబడి వచ్చింది..
సిద్దిపేట,మార్చి 19: మా ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రోత్సాహంతో నేను ఆయిల్‌పామ్ తోట పెట్టాను. మాకున్న 14 ఎకరాల్లో దశల వారీగా ఆయిల్‌పామ్ తోటలు పెంచగా, ఇప్పటి వరకు 3సార్లు గెలలు కోయగా, 28 టన్నుల పంట దిగుబడి వచ్చింది. మాలాంటి రైతులు పంటను సులభంగా అమ్ముకునేందుకు వీలుగా కేసీఆర్, హరీశ్‌రావు సార్లు నర్మెలో పామాయిల్ ఫ్యాక్టరీ కట్టడంతో మాకు మేలు జరిగింది. ఈ ఫ్యాక్టరీ మా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
-కనకారెడ్డి, రైతు,కోనాయిపల్లి (సిద్దిపేట జిల్లా)
హరీశ్‌రావు ప్రోత్సాహంతో పెంపకం
చిన్నకోడూర్, మార్చి 19 : సిద్దిపేట ప్రాంతంలో రైతులు పా మాయిల్ తోటలు పెట్టారంటే ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రోత్సాహంతోనే సాధ్యమైంది. ఆయిలపామ్ గెలలు దూర ప్రాంతానికి వెళ్లి విక్రయించి ఇబ్బందులు పడకుండా ఉండాలని ఉద్దేశంతో నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడానికి వస్తున్నా రు. కాంగ్రెస్ రైతులకు ఏమిచేయ డం లేదు.
-ఏలేటి నర్సింహారెడ్డి, రైతు, మాచాపూర్ (సిద్దిపేట జిల్లా)
బీఆర్ఎస్ హయాంలోనే ప్రోత్సాహం
గజ్వేల్, మార్చి 19: బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్‌పామ్ తోటలు సాగుచేసేందుకు రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించింది. మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతో నేను నాలుగు ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు పెట్టాను. మా గ్రామంలో చాలా మంది రైతులు ఆయిల్‌పామ్ తోటలు సాగు చేశారు. నాలుగేండ్ల కింద నాలుగు ఎకరాల విస్తీర్ణంతో తోట పెట్టా.. ఇప్పటికీ ఆరుసార్లు క్రాప్ వచ్చింది. నాలుగెకరాల్లో రూ.1.60లక్షల ఆదాయం వచ్చింది. ఏటా అంతర పంటలు సాగు చేయడంతో వాటి ద్వారా మంచి ఆదాయం సమకూరింది. నర్మెట వద్ద పామాయిల్ ఫ్యాక్టరీ కేసీఆర్ సహకారం, హరీశ్‌రావు కృషితోనే ఏర్పాటైంది.
– మద్ది రాజిరెడ్డి, రైతు, అహ్మదీపూర్ (సిద్దిపేట జిల్లా)
16 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుచేశా..
ఎమ్మెల్యే హరీశ్‌రావు రైతులు బాగుపడాలన్న గొప్ప సంకల్పంతో సొంత డబ్బులతో మమ్మల్ని అశ్వరావుపేట తీసుకెళ్లి పామాయిల్ తోటల సాగు విధానం గురించి అవగాహన కల్పించారు. దీంతో ఎంతోమంది రైతులు ముందుకు వచ్చి పామాయి ల్ తోటలు పెట్టుకున్నారు. నేను 16 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు పెంచుతున్నా.
– పుచ్చకాయల ఓజిరెడ్డి, రైతు, విఠలాపూర్ (సిద్దిపేట జిల్లా)
పదిసార్లు గెలలు వచ్చాయి..
దుబ్బాక, మారి ్చ19 : నాకున్న ఐదెకరాల్లో వరి పంట వేసేవాడిని. సరైన దిగుబడులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం సూచనలతో పంట మార్పిడిపై దృష్టిసారించి, ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి కనబరిచా. ఆశ్వారావుపేటకు వెళ్లి ఆయిల్‌పామ్ తోటల పెంపకాన్ని పరిశీలించాను. ప్రభుత్వం సబ్సిడీతో నాకు ఆయిల్‌పామ్ మొక్కలు, డ్రిప్ పరికరాలు అందజేసింది. ఒక్కో ఎకరంలో 57 మొక్కలు చొప్పున మొత్తం మూడెకరాల్లో 172 మొక్కలు నాటాను. అధికారుల సూచనలు పాటిస్తూ మొక్కలు నాటి, వాటి సంరక్షణ చర్యలు తీసుకున్నా. నన్ను చూసి మా గ్రామంలో మరో 30 మంది రైతులు 200 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు సాగుచేశారు.
ఆయిల్‌పామ్ పంటకు చీడపీడలు, కోతులు, అడవి పందుల బెడద ఉండదు. ప్రకృతి వైపరీత్యాల గురించి భయం లేదు. ఒక్కసారి పంట వేస్తే 35 ఏండ్ల వరకు పంటకు గ్యారంటీ ఉంటుంది. అంతర పంటలతో అదనపు ఆదాయం వస్తున్నది. నేను ఇప్పటి వరకు 10 సార్లు పంటను విక్రయించాను. 25 రోజుకు ఒకసారి గెలలు కోతకు వస్తున్నాయి. ఇప్పుడు మూడెకరా ల్లో ఒక టన్ను కాత వచ్చింది. రూ. 20 వేల వరకు ఆదాయం సమకూరింది. మరో రెండేండ్లలో పంట దిగుబడి రెట్టింపు అవుతుంది. కేసీఆర్, హరీశ్‌రావు సార్లకు రుణపడి ఉంటాను.
-మహమ్మద్ గౌస్, రైతు, హబ్షీపూర్, దుబ్బాక మండలం (సిద్దిపేట జిల్లా)
వారి ముందు చూపుతోనే ఫ్యాక్టరీ ఏర్పాటు
కేసీఆర్, హరీశ్‌రావు సార్లు ముం దు చూపుతో ఆలోచించి నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్‌పామ్ తోటల పెంపకంపై అవగాహన కల్పించడంతో నాతో పాటు ఎంతోమం ది రైతులు ముందుకు వచ్చి ఆయిల్‌పామ్ తోటలు పెట్టారు. నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం కానుండడం చాలా సంతోషంగా ఉంది.
– బండి రమణారెడ్డి, రైతు, మీర్జాపూర్, హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా)