ఉప్పల్, జూలై 20 : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్లోని పలు ప్రాంతాలలో బుధవారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతతో కలిసి పర్యటించారు. ఈ మేరకు.. ఎమ్మెల్యే సీడీపీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు అంబేద్కర్‌నగర్‌కాలనీలో శంకుస్థాపన చేశారు.
అనంతరం కాలనీలలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. కమ్యూనిటీహాల్ నిర్మాణం చేపట్టాలని, బోరుకు మోటరు బిగించాలని కాలనీవాసులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులలో మాట్లాడి బోరు మోటర్‌కు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.50 లక్షల వరకు చిలుకానగర్ డివిజన్‌కు కేటాయించడంపై ఎమ్మెల్యేకు కార్పొరేటర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్పార్టీ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, బజార్ జగన్, రాంరెడ్డి, జగన్, వేణుగోపాల్‌రెడ్డి, అల్లిబిల్లి మహేందర్, బాలకృష్ణ, శ్రీనివాస్‌యాదవ్, మాస శేఖర్, రామానుజం, సుందర్, అశోక్‌చారి, బాలేందర్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.