చర్లపల్లి, ఆగస్టు 4 : పరిసరాలను ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకొవాలని, ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులో ఏర్పడిన గుంతలను పూడ్చివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ పేర్కొన్నారు. ఫ్రీమాన్సూన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఈసీనగర్, చక్రీపురం, రైల్వే విహార్ కాలనీ, బీఎన్‌రెడ్డినగర్ కాలనీలలో సర్కిల్ అధికారులు పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకొని చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాప్రా సర్కిల్ అన్ని రంగాలలో అభివృద్ధి చేయడంతో పాటు స్వచ్ఛ సర్కిల్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
అనంతరం సామాజిక బాధ్యతలో భాగంగా చక్రీపురంకు చెందిన చిట్టిబాబు, కుషాయిగూడ ఫీష్ మార్కెట్ అధ్యక్షుడు రెండు కెమెరాలను డీసీ జగన్, ఎఎంఓహెచ్ మధుసూదన్‌రావు, సీఎంఓహెచ్ అధికారిణి పద్మజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ నాగేందర్, శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, ఏఈ స్రవంతి, వెటర్నరీ వైద్యుడు శ్రీనివాస్‌రావు, వివిధ విభాగల అధికారులు లోకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.