Nala Works | అల్లాపూర్, మే 29 : సున్నం చెరువు ఎగువ నుంచి మైసమ్మ చెరువుకు దిగువకు ప్రవహిస్తున్న నాలా విస్తరణ పనులు ప్రారంభించాలని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహాబేగం అధికారులను కోరారు. గురువారం మూసాపేట సర్కిల్ -23 డిప్యూటీ కమిషనర్ వంశీ కృష్ణతో కలిసి కార్పొరేటర్ రాజీవ్ గాంధీ నగర్లో నాలాను పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముంపు సమస్య తలెత్తకుండా ఉండాలంటే నాలాలో విస్తరణ పనులను వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ హమీద్, సయ్యద్ రియాజ్, షేక్ రఫీక్, సలీం, అస్లం, మల్లేష్, షఫీ, మహామ్మద్, గౌస్, తదితరులు పాల్గొన్నారు.
PM Modi | ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం : ప్రధాని మోదీ
Sunkishala | సిటీకి సుంకిశాలే శరణ్యం.. కేసీఆర్ దిశలోనే కాంగ్రెస్ సర్కారు
Navy plane Crashes | ఘోర ప్రమాదం.. కూలిన నేవీ విమానం