చర్లపల్లి, మే 22 : చర్లపల్లి డివిజన్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ స్టాడింగ్ కమిటీ సభ్యురాలు, డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని మారుతినగర్లో చేపట్టిన అభివృద్ధి పనులను సర్కిల్ డీఈ బాలకృష్ణ, ఎలక్ట్రికల్ డీఈ రవీందర్, సర్కిల్ ఏఈ స్వరూప, కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.
అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. డివిజన్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌తో పాటు కాలనీవాసుల, నాయకులు తదితరులు పాల్గొన్నారు.